Ponniyin Selvan 1: చాలా కాలం తర్వాత మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 1’తో హిట్ కొట్టాడు. ప్రముఖ రచయిత కల్కి క్లాసిక్ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను రూపొందించారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ తమిళనాట ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు కల్కి ట్రస్ట్‌కు కోటి రూపాయల చెక్కును అందించారు. ఇటీవల మణిరత్నంతో పాటు నటీనటులు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తీబన్‌తో కూడిన ‘పొన్నియిన్ సెల్వన్’ యూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. ఆదరించిన ప్రేక్షకులకు, సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలియచేసింది.
Chiyaan Vikram: చియాన్ విక్రమ్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన నటి పూర్ణ
ఆ తర్వాత లైకా గ్రూప్ చైర్మన్ ఎ. సుభాస్కరన్, దర్శకుడు మణిరత్నం కల్కి కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్‌ను సందర్శించి, ట్రస్ట్ కార్పస్ ఫండ్‌కు విరాళంగా కోటి రూపాయల చెక్కును అందజేశారు. కల్కి కృష్ణమూర్తి కుమారుడు కల్కి రాజేంద్రన్ సమక్షంలో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సీతా రవికి ఈ విరాళాన్ని అందజేశారు. చోళ రాజ్యంలో జరిగే ఆధిపత్య పోరు కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 2 త్వరలోనే విడుదల కానుంది.