ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన విదేశీ పర్యటనలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక చిత్రాల ద్వారా రూపొందించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను పంచుకుంటూ.. ప్రధాని మోడీ క్యాప్షన్‌లో ” భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది!.. నేను ఎక్కడికి వెళ్లినా, నా దేశ చరిత్ర, సంస్కృతి పట్ల నాకు అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది.” అని రాసుకొచ్చారు.
READ MORE: Sircilla: కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే- ఐఏఎస్ అధికారుల సంఘం..
వీడియోలో ఏ దేశం యొక్క ప్రదర్శన ఉంది?
ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలపై ఎక్స్‌లో పంచుకున్న వీడియోలో.. ఇటీవలి విదేశీ పర్యటనల సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఇచ్చిన ప్రదర్శనలను రూపొందించారు. అందులో ఆస్ట్రియాలో వందేమాతరం పాడటం, పోలాండ్, మాస్కోలలో గర్బా ప్రదర్శనలు, కజాన్ (రష్యా), భూటాన్‌లో దాండియా రాస్, సింగపూర్‌లో భరతనాట్యం, లావోస్, బ్రెజిల్‌లలో రామాయణం, ఇతర కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రధాని షేర్ చేసిన వీడియోలో మోడీని ప్రస్తావిస్తూ భూటాన్ కళాకారుల జానపద గీతం కూడా ఉంది.
READ MORE: Raja Singh: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఏమన్నారంటే?
భారతీయ సంస్కృతి పట్ల ప్రేమను ప్రదర్శించారు..
భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల ప్రపంచవ్యాప్త ఉత్సాహం మనందరికీ ఎంతో గర్వకారణమని ప్రధాని మోడీ రాశారు. గత కొన్నేళ్లుగా నేను ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా తమ దేశ సంస్కృతిపై ప్రజల అపారమైన ప్రేమను చూడటం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని ఆయన తెలిపారు.