ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన విదేశీ పర్యటనలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక చిత్రాల వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను పంచుకుంటూ.. ప్రధాని మోడీ క్యాప్షన్‌లో " భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది!.. నేను ఎక్కడికి వెళ్లినా, నా దేశ చరిత్ర, సంస్కృతి పట్ల నాకు అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది." అని రాసుకొచ్చారు.