Piracy: పైరసీ సినిమాల అంశంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. SBI ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమవుతున్నట్లు తెలుస్తోంది! sbiterminsurance.com పేరుతో అందుబాటులో వెబ్ సైట్ ఉంది.. Term insurance laps and revival guide రీ-డైరెక్ట్ పేజీలో పైరసీ సినిమాలు ఓపెన్ అవుతున్నాయి.. పైరసీ వెబ్ సైట్లు I Bomma పేరును వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు iBommaగా పేరు మార్చి.. వాటిపై క్లిక్ చేస్తే తమ పేజీకి రీ-డైరెక్ట్ అయ్యేలా నకిలీగాళ్లు మార్చేశారు. తాజాగా iBomma plus ane website పై క్లిక్ చేస్తే.. movie rulzకి రీడైరెక్ట్ అవుతోంది.
READ MORE: Drinking Water Benfits: పురుషులు, స్త్రీలు ఎన్ని లీటర్ల నీరు తాగితే మంచిదో తెలుసా..
మరోవైపు.. ఐ-బొమ్మ అనే పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్వయంగా అతని చేతనే పోలీసులు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయించారు. అయితే, ఇప్పుడు తెరమీదకు కొత్తగా ఐ-బొమ్మ వన్ అనే ఒక వెబ్‌సైట్ వచ్చింది. ఐ-బొమ్మ కోసం వెతుకుతున్న వారికి ఈ ఐ-బొమ్మ వన్ ఇప్పుడు దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్ ఎవరిది అనే చర్చ నడుస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో ఏదైనా సినిమా చూడాలని ప్రయత్నించి లింక్ మీద క్లిక్ చేయగా, అది మూవీ రూల్స్ (Movie Rulz) వెబ్‌సైట్‌కి రీ-డైరెక్ట్ అవుతోంది. ఐ-బొమ్మ లాగానే మూవీ రూల్స్ వెబ్‌సైట్ కూడా చాలా కాలం నుంచి నడుస్తోంది. ఈ సైట్ ఏకంగా సినిమాల హెచ్‌డీ ప్రింట్‌తో పాటు, అప్పుడే రిలీజ్ అయిన సినిమాల థియేటర్ ప్రింట్‌లను సైతం అప్‌లోడ్ చేస్తూ వస్తోంది.