నీరు అనేది మన ఆహారంలో ఎంతో ముఖ్యమైంది. ఒక రోజు ఆహారం లేకుండా అయినా.. ఉండవచ్చు కానీ.. నీరు లేకుండా ఉండలేము.. పురుషులు, స్త్రీలు ఇద్దరూ రోజులో ఎన్ని లీటర్ల నీటిని తీసుకుంటే మంచిదో మీకు తెలుసా.. అయితే.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నీరు లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవించలేదు.. మనకు ప్రతి విషయంలో నీరు ఎంతో సహాయం ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల మనకు నీరు సరిపడినంత దొరకపోవచ్చు. కానీ కచ్చితంగా నీటిని మాత్ర తాగాల్సిందే.
Read Also: Walk After Meals: భోజనం చేసిన తర్వాత.. 10 నిమిషాలు నడవడం వల్ల ఏమవుతుందో తెలుసా..
పురుషులు రోజుకు 3.1 లీటర్ల నీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు తెలిపారు. అదే విధంగా మహిళలు.. 2.71 లీటర్ల నీటిని తాగడం శ్రేయస్కరమంటున్నారు. మీ పరిమాణం, జీవక్రియ, స్థానం, ఆహారం, శారీరక శ్రమ, ఆరోగ్యం అన్నీ మీరు రోజుకు ఎంత నీరు త్రాగాలి అనే దానిపై ఆధారపడి ఉంటాయని ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్ సాదియా హుస్సేన్ చెప్పారు .
మనం వ్యాయామం చేయడం.. రోజంతా ఉరుకులు పరుగులు పెడతుంటాం. దీంతో మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. అంతే కాకుండా మన బాడీలోని వ్యర్థాలన్ని కూడా మూత్ర విసర్జన రూపంలో బయటకు వెళ్తాయి. అయితే వీటిని భర్తీ చేసేందుకు మనం కచ్చితంగా.. నీటిని తాగాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఉదయం సమయాల్లో మనం వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాల్సి ఉంటుందని నిఫుణులు చెబుతున్నారు. పరిమాణం.. మీ బరువును బట్టి.. మీ శరీరానికి అంత ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ఆరోగ్యం, అనారోగ్యంతో పోరాడటం వలన నిర్జలీకరణం సంభవించవచ్చు.
Read Also: Postponed: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్ లాంచ్ వాయిదా..
ముఖ్యంగా మీకు జ్వరం ఉంటే లేదా వాంతులు లేదా విరేచనాలు కారణంగా ద్రవాలు కోల్పోతుంటే. మీ శరీరం కోలుకోవడానికి.. దానిని భర్తీ చేయడానికి మీ రోజువారీ నీటి పరిమాణాన్ని పెంచడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆల్కహాల్ ఒక మూత్రవిసర్జన పదార్థం.. ఇది మిమ్మల్ని నిర్జలీకరణానికి గురి చేస్తుంది. ఆల్కాహాల్ తీసుకనే ముందు భారీగా నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి కాబట్టి.. మీరు దీన్ని ఫాలో అయ్యే ముందు డాక్టర్ ని కలిసి.. సలహా తీసుకోవడం ఎంతో ఉత్తమం.