ఈ మధ్య కుక్కుల దాడి ఘటనలు అధికమవుతున్నాయి. వీధుల్లో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు అవస్థలు తప్పడం లేదు. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కుక్క కాటుకు ప్రజలు ఆస్పత్రులు పాలవుతున్నారు. పిల్లలు,పెద్దలపైనా దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. అయితే, మహారాష్ట్రంలో మాత్రం పందుల బెడద ఎక్కువైంది. చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపై పంది తన ప్రతాపం చూపించింది. తాజాగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై పంది దాడి చేసింది.
Also Read: Tourist Attraction: ఆస్కార్ గెలిచిన ‘ఎలిఫెంట్’.. ఏనుగును చూసేందుకు జనం క్యూ
మహారాష్ట్రంలోని గోండాలో ఓ బాలుడు ఇంటి బయట స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే, అటుగా దూసుకొచ్చిన ఓ పంది బాలుడిపైకి దూకి దాడి చేసింది. బాలుడు తనను తాను రక్షించేందుకు ప్రయత్నించినా ఆ పంది విడిచిపెట్టలేదు. భయ పడిన బాలుడి స్నేహితులు పారిపాయారు. పంది దాడిని గమనించిన స్థానికులు.. పంది దాడి నుంచి బాలుడిని కాపాడారు. పందిని తరిమికొట్టారు. అయితే, పంది దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పందుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పందుల బెడద కారణంగా పిల్లలను బయటకు పంపెందుకు జంకుతున్నారు