ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రం. భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగు ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి తరలివచ్చారు.
తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో రెండు అనాథ ఏనుగులను దత్తత తీసుకున్న కుటుంబం చుట్టూ ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా కథాంశం తిరుగుతుంది. మదుమలై నేషనల్ పార్క్‌బ్యాక్‌డ్రాప్‌లో ది ఎలిఫెంట్ విస్పరర్స్ తెరకెక్కింది. బొమ్మన్, బెల్లీ అనే దంపతులు ఓ ఏనుగు పిల్లను పెంచుకుంటారు. దానికి రఘు అనే పేరు పెట్టుకుంటారు. ఈ సినిమాలో వారి మధ్య అనుబంధాన్ని, ప్రేమను తెలియజేయటమే, అడవి అందాలను అద్భుతంగా చూపించారు. చెట్లు రంగు మారడం, నది తిరిగి పుంజుకోవడం, వేసవిలో అడవి కాలిపోవడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కట్టునాయకన్ తెగకు చెందిన బొమ్మన్, బెల్లీ జీవితం ఈ అడవి చుట్టూ తిరుగుతుంది 2022లో ది ఎలిఫెంట్ విస్పరర్స్ నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది.
Alos Read: Arvind Kejriwal: రాజస్థాన్‌పై ఆప్ గురి.. బీజేపీ, కాంగ్రెస్ సంగతేంటి?
ఈ మూవీకి ఆస్కార్ రావడంతో అందరి దృష్టి ఆ ఏనుగుపై పడింది. ఈ ఏనుగును చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు క్యూ కట్టారు. సినిమాలో చూపిన పిల్ల ఏనుగును చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరంలో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. “ఇది చాలా గొప్ప క్షణం. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఏనుగు నాకు ఇష్టమైన జంతువు మరియు ఈ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకోవడం నాకు సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది” అని ఒక పర్యాటకుడు చెప్పాడు.
Alos Read:Delhi MLA’s Salaries: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు.. ఇప్పుడు ఎంతో తెలుసా?
కాగా, 95వ ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ డాక్యుమెంటర్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ విజేతగా నిలిచింది. ఈ చిత్రాన్ని గురునీత్ మోంగ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని కార్తీక్ గోన్‌స్లేవ్స్ డైరెక్ట్ చేశారు. హాల్ ఔట్, మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్‌లతో ది ఎలిఫెంట్ విస్పరర్స్ పోటీ పడి విజేతగా నిలిచింది. ఈ ఏడాది మన దేశం తరపున తొలి అవార్డు ఈ షార్ట్ ఫిల్మ్ దక్కించుకోవటం గమనార్హం.