Perni Nani: జనసేన-టీడీపీ పొత్తులపై క్లారిటీ వచ్చేసింది.. సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జనసేన-టీడీపీ పొత్తుతో ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. బీజేపీ కూడా కలిసివస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది. జనసేన-టీడీపీ పొత్తుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ ఎప్పుడు క్లారిటీగా ఉన్నాడు.. బీజేపీకే క్లారిటీ లేదన్నారు పేర్ని నాని.. బీజేపీతో పవన్ పొత్తు ఎప్పుడూ ప్రస్తుతమే.. పూర్తిస్థాయిలో ఎప్పుడూ ఉండబోదన్నారు. జస్ట్ బీజేపీతో టెంపరరీ పొత్తు మాత్రమే అన్నారు. నిండు అమవాస్య రోజు పొత్తు ప్రకటన.. శుభ సూచికంగా అభివర్ణించారు. లోకేష్ టీడీపీకి మద్దతు ప్రకటిస్తే.. ఎలా ఉంటుందో పవన్ చెప్పింది కూడా అలాగే ఉందన్న ఆయన.. పవన్ టీడీపీలో అంతర్భాగం.. ఇది లోకానికి తెలుసన్నారు. పవన్ వైఖరి చావు పరామర్శకు వచ్చి.. పెళ్లికి లగ్గం పెట్టుకున్నట్టు ఉందన్నారు. చంద్రబాబుకు నాకు సైద్ధాంతిక విభేదాలు మాత్రమే అని పవన్ చెప్తున్నాడు.. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. చంద్రబాబుతో కలవడానికి ఉన్న సిద్ధాంతం ఏంటి..? అని నిలదీశారు.
ఇక, బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసినా కూడా 20 ఏళ్ళు జగన్ ను ఏమి చేయలేరనే ధీమాను వ్యక్తం చేశారు పేర్ని నాని.. గతంలో టీడీపీ అవినీతిపరులు.. ఇప్పుడు నీతిపరులు ఎలా అయ్యారు పవన్ కల్యాణ్ ? అని ప్రశ్నించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని బావ జనతా పార్టీగా మార్చేశారు అంటూ సెటైర్లు వేశారు. సుత్తి.. సినిమా డబ్బా కబుర్లలో పవన్ నెంబర్ వన్.. పాతిక సీట్లు కూడా పోటీ చేయని పవన్ కు ఎందుకు ఇన్ని పాట్లు అని దుయ్యబట్టారు.. పార్టీ పెట్టిన ఏడేళ్లలో 151 సీట్లు 50 శాతం ప్రజల ఆమోదంతో గెలిచిన పార్టీపై వ్యవస్థలేని వ్యక్తి ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు.. రాజకీయ పార్టీ సిద్ధాంతం.. ఏంటని అడిగే హక్కు అందరికీ ఉంటుంది.. నేను చంద్రబాబు కోసమే పార్టీ పెట్టా.. అని ధైర్యంగా చెప్పు అంటూ పవన్ కల్యాణ్‌ను నిలదీశాడు మాజీ మంత్రి పేర్ని నాని.