AP Police: స్టేజ్‌పై నృత్య ప్రదర్శనలు ఇచ్చే సమయంలో.. కొంత రియాల్టీగా ఉండాలని.. కొన్ని సార్లు డ్యాన్సర్లు సాహసాలు చేస్తుంటారు.. అవి వారికి తంటాలు కూడా తెచ్చిపెడుతుంటాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటిదే ఓ కేసు నమోదు అయ్యింది.. ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై ఓ డ్యాన్స్ గ్రూప్ ‘విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన..’ అంటూ సాగే కాంచన్ సినిమా టైటిల్ సాంగ్‌కు నృత్యం చేసింది.. అచ్చం కాంచన సినిమాలో మాదిరిగా.. డ్యాన్సర్స్ రెచ్చిపోయి స్టేప్పులు వేశారు.. ఆ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ గ్రూప్‌లో కీ డ్యాన్సర్‌గా ఉన్న వ్యక్తి.. ఓ కోడిని పట్టుకొని నృత్యం చేశాడు.. అంతటితో ఆగలేదు.. మధ్యలో ఆ కోడి తల కొరికేసి.. రక్తం తాగుతూ.. భయానకంగా కనిపించే విధంగా.. డ్యాన్స్‌తో అదరగొట్టాడు.. ఆ నృత్యాన్ని కాస్తా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు కొందరు వ్యక్తులు..
Read Also: Rashmi: వాళ్ళు మేజర్లలా రేప్ చేస్తే మైనర్లు అంటారేంటి.. వాళ్ళని వదలద్ధంటున్న రష్మీ
ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి, 1860, (IPC)లోని సెక్షన్ 429 మరియు 34 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. మరియు ఆ నృత్య ప్రదర్శకుడు తోపాటు నిర్వాహకులకుపై కూడా జంతువుల పట్ల క్రూరత్వం వహించినందుకు (PCA) చట్టం, 1960లోని సెక్షన్ 11(1) కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు.. కాగా, గతంలో కూడా ఈ డ్యాన్స్ గ్రూప్ ఇలాంటి స్టేజీ షోలు ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. డ్యాన్స్ షోలో కోడి తలను కొరికి చంపినందుకు.. విష్ణు ఎంటర్‌టైన్‌మెంట్స్ (డ్యాన్స్ ట్రూప్ కంపెనీ)పై అనకాపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. జులై 6న IPCలోని సెక్షన్ 429 r/w 34 (జంతువును చంపడం మరియు ఉమ్మడి నేర బాధ్యత) మరియు జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం, 1960లోని సెక్షన్ 11 (1) (a) కింద కేసు నమోదు చేశారు. ప్రేక్షకుల్లో ఉన్న చిన్నారులు కళ్లారా చూసిన పక్షిని కొరికి చంపి.. వినోదం పేరుతో చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొనడంతో చర్యలకు దిగారు పోలీసులు.