Sunil Gavaskar: అశ్విన్ ‘కోలిగ్స్’ కామెంట్లపై సునీల్ గవాస్కర్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కకపోవడంతో చాలామంది ఆశ్చర్యాన్నికి గురయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమితో అశ్విన్‌ని తీసుకోకపోవడం వల్లేనని మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానించారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ చేసిన ట్వీట్ ఇప్పుడు గందరగోళం రేపుతుంది. అశ్విన్ ట్వీట్.. ఇంతకుముందు టీమ్‌లో అందరూ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లు.. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, జస్ట్ కోలిగ్స్‌లా ఉంటున్నారంతే అంటూ రాసుకొచ్చాడు.
Read Also: MP Arvind : ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలి
Also Read
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
టీమిండియాలో ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది.. మన పని ఏంటి? అది చేశామా.. లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కనీసం పక్కనున్న ప్లేయర్ ఎలా ఉన్నాడు? ఏం ఆలోచిస్తున్నాడనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదని ఆర్. అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అశ్విన్ చేసిన కోలిగ్స్ కామెంట్లు నన్ను చాలా బాధపెట్టాయని సీనియర్ క్రికెటర్ సునీల్ గావాస్కర్ అన్నారు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? క్రికెట్ గురించి కాకపోయినా మ్యూజిక్ గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి.. ఏదో ఒకటి మాట్లాడుకోవాలి అంటూ సన్నీ తెలిపారు.
Read Also: Minister RK Roja: పవన్‌కు మాస్ వార్నింగ్.. వెంట్రుక కూడా పీకలేవు..!
అలా మాట్లాడుకున్నప్పుడే ఆటలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది అని సునీల్ గవాస్కర్ తెలిపారు. అనవసర ఆలోచనలతో అలిసిపోయిన మెదడు, కాస్త డైవర్ట్ అవుతుంది.. ప్లేయర్ల మధ్య అనుబంధం పెరిగి, స్నేహంగా మారుతుంది అని సన్నీ పేర్కొన్నారు. మ్యాచ్ అయ్యాక జోకులు, నవ్వులు, అల్లర్లు, సరదాలు, స్నేహాలు.. ఇవి చాలా కామన్.. ఇంతకు ముందు ప్లేయర్లందరికీ ఒకే గదిలో ఉంచేవాళ్లు.. 20 ఏళ్లకి ముందు ఏ ఫారిన్ టూర్‌కి వెళ్లినా ప్లేయర్లు అంతా కలిసి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్లేయర్‌కో సింగిల్ గది ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు ప్రతీ ప్లేయర్‌కి ఓ సెపరేట్ స్పెస్ ఉంటోంది.. దీని వల్ల ప్లేయర్ల మధ్య అంతరం పెంచుతోంది అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కామెంట్స్ చేశాడు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు