పుష్కర కాలం తరువాత గాంధీ భవన్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అర్బాటంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.. దాని వల్ల ప్రజలకు ఏం ఒరిగింది అని విమర్శించారు. గతంలో పోటీ చేశారు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.. ఎవరెవరు ఎలాంటి వారని యావత్ రాష్ట్రం చూసింది.. టికెట్ల వ్యవహారంలో మీ సహచర శాసన సభ్యులు మీ గురించి అన్నారు అని జూపల్లి కామెంట్స్ చేశాడు.
Read Also: Kabaddi Tournament: కబడ్డీ మ్యాచ్‌లో కొట్టుకున్న రెండు వర్గాలు..కత్తులు, తుపాకీలతో దాడి
కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారు అని జూపల్లి విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికల్లో మీరు పెట్టిన ఖర్చు ప్రపంచంలో ఎవరు పెట్టలేదు.. మీరు ఇందులో ఆదర్శమా.. వేల కోట్లు ఖర్చుపెడతారు.. గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర నేతల వరకు అందరిని కొనాలని చూస్తారు.. 26న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఉంటది.. 9 సంవత్సరాల్లో లక్ష రుణమాఫీకి వడ్డీ లక్ష అయింది.. మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేశారు.. మీరు ట్రైలర్ చూసారు.. మీ 9 ఏళ్ళ సినిమా ఇప్పుడు ఎండ్ కావడానికి వచ్చింది.. కారును గుద్దుడు గుద్దతే అప్పడం కావాలి.. నేను కొల్లాపూర్ నుంచి పోటీ చేయడానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను అని జూపల్లి తెలిపాడు.
Read Also: Rashi Khanna: కాటుక కళ్ళతో కట్టి పడేస్తున్న రాశి ఖన్నా..
కేటీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవం ఢిల్లీకి తాకట్టు పెట్టారంటారు అని కామెంట్స్ చేస్తున్నాడు.. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోవు.. అప్పుడు ఆత్మగౌరవం ఉండదా అని జూపల్లి ప్రశ్నించారు. గాంధీ భవన్ లో, ఢిల్లీ ఏఐసీసీలో కూడా టికెట్ల కోసం కొట్టుకుంటాం.. మాకు ఆ ప్రజాస్వామ్యం ఉంది.. మీకు నెహ్రు కుటుంబానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది.. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు.. ఓటమిని అంగీకరించినట్టేగా అని ఆయన అన్నారు.
Read Also: Renu Desai: అతని గురించి ఏది పడితే అది రాయకండి.. ట్విస్ట్ ఇచ్చిన పవన్ మాజీ భార్య
తెలంగాణలో అవినీతి, అరాచకం, భూకబ్జాలు పెట్రేగిపోతున్నాయని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అక్టోబర్ 16 మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామంటున్నారు.. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు.. మరి గత మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదు.. రాష్ట్ర ప్రజలకు ముందు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. వేల కోట్లు దోచుకుంటున్నారు.. ధరణి, భూ మాఫియాపై సీబీఐ విచారణ చేపించగలరా.. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వస్తారా..? నేను రుజువు చేస్తానని జూపల్లి సవాల్ విసిరారు.
Read Also: Parakramam: మాంగల్యం డైరెక్టర్ ‘పరాక్రమం’తో వచ్చేస్తున్నాడు!
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. మంత్రి హరీష్ రావు గురించి డబ్బా పెట్టె స్లిప్పర్ చెప్పులు అన్నారని మాజీమంత్రి జూపల్లి తెలిపారు. ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయి.. కేటీఆర్ అదంతా అబద్దం అన్నట్టు వ్యవహరిస్తున్నారు.. మైనంపల్లి హన్మంతరావు తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా మాట్లాడారు.. మైనంపల్లి దెబ్బ కేసీఆర్ కి రుచి చూపించాలి.. ఆత్మగౌరవం, రోషం, పౌరుషం ఉండాలి.. పట్నం మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న పట్నం పౌరుషం చూపించాలి.. కేసీఆర్ కు దిమ్మ తిరగాలి అని జూపల్లి కృష్ణారావు అన్నారు.