కేసీఆర్ వల్లే తెలంగాణ రాజకీయాలు డబ్బు చుట్టు తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రెండు టర్ములల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించారు అని ఆయన విమర్శించారు.
పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తిరగపడ్తామ్ తరిమి కొడతాం అనే కార్యక్రమంపై చర్చించామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు.
కలకుంట్ల మదన్ మోహన్‌రావు. తెలంగాణ కాంగ్రెస్ ఐటీ విభాగం ఇంఛార్జ్. గత లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలంగా మదన్ మోహన్ తీరు పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. కాంగ్రెస్ సీనియర్లను కాదని.. కార్యకర్తల ప్రమేయం లేకుండా కామారెడ్డి జిల్లాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీలు సెగలు రేపుతోంది. ఈ దఫా ఆయన ఎంపీగా కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలపై ఆయన కన్నేసినట్టు టాక్.…
చెప్పకుండా రేవంత్ రావడంపై నల్లగొండ జిల్లా నేతల అభ్యంతరం?కాంగ్రెస్ అంటేనే నేతల మధ్య కయ్యలా మారి పార్టీగా మారిపోయింది. అది జిల్లాస్థాయి సమావేశమైనా.. తాజాగా రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశమైనా పంచాయితీ కామన్. మీడియా ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్సే అందుకు అద్దం పడుతున్నాయి. సీఎల్పీలో మీడియా సమావేశం కంటే ముందే.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ ఇంట్లో భేటీలు జరిగాయి. కొందరు ముఖ్య…
మొన్నటి వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని చర్చ జరిగింది. ఇప్పుడేమో వస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదట. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ గుర్తించినా.. ముందు వరసలో తళుక్కుమంటున్నా.. ఆయన ఒకరు ఉన్నారన్న సంగతే ఎవరికీ తెలియడం లేదట. చిర్రెత్తుకొచ్చిన ఆ నాయకుడు పార్టీ ఇంఛార్జ్‌కి ఫోన్ చేసి ఓ రేంజ్‌లో అందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా గొడవ? పార్టీ నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు! తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరి స్టైల్…
సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండనున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. 11వ తేదీ నుండి హుజూరాబాద్ లో 7 సభలు. మండల కేంద్రాల్లో సభలు పెట్టనున్నట్లు స్పష్టం చేసారు. ఈటల మీద విచారణ జరిపిన నివేదికలు ఏమయ్యాయి అని ప్రశ్నించిన ఆయన ఈటల బీజేపీ లో చేరడానికి కేసీఆర్ కారణం అని పేర్కొన్నారు. ఈటల బీజేపీ లో చేరిన వెంటనే విచారణలు ఎందుకు ఆగిపోయాయి. హుజురాబాద్ నియోజక వర్గ అభ్యర్థిత్వం…
ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచుతూ జీఓ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ పెంచారు. ప్రభుత్వానికి భూముల మార్కెట్ విలువ పెంచడం ద్వారానే ఆదాయం వస్తుంది. కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ ఎందుకు పెంచారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజల పై ఆర్థిక భారం పడుతుంది. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ చార్జీలు వెంటనే తగ్గించాలి. తెరాస అధికారం లోకి…