టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూరి, సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో పాటు, విభిన్నమైన నటనకు పేరుగాంచిన సేతుపతిని, పూరి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది.
Also Read : Nani : ‘ది ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్.. నిజమేనా?
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. తెలుగులో బింబిసారా, విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంయుక్త మీనన్ ను పూరి సేతుపతి సినిమా కోసం ఫిక్స్ చేసారు. ఈ విషయాన్నీ తాజాగా అధికారకంగా ప్రకటించారు మేకర్స్. తెలుగులో ఇప్పటికే అఖండ 2, స్వయంభు వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజిగా ఉన్న సంయుక్త ఇప్పుడు మరో భారీ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. పూరి సినిమాలలో హీరోయిన్స్ కు ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మరి సంయుక్తను పూరి ఎలా చూపిస్తాడోననే క్యూరియాసీటి అయితే ఉంది. కాగా ఈ సినిమాను పూరి కనెక్స్ట్ బ్యానర్‌పై ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మాణం చేస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. డబుల్ ఇస్మార్ట్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న పూరి ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.