హైదరాబాద్ లో డిఫెన్స్ మద్యం పట్టుబడింది. మల్కాజిగిరిలో 37 బాటిల్లు, మేడ్చల్ లో 24 బాటిల్ల మద్యం సీజ్ చేశారు అధికారులు. ఎక్స్ ఆర్మీ పర్సన్ ను అరెస్ట్ చేశారు. ఎక్స్ ఆర్మీకి చెందినటువంటి ఇద్దరూ వ్యక్తులు రెండు చోట్ల మద్యం అమ్మకాలు జరుపుతున్నారు అనే సమాచారం మేరకు మల్కాజిగిరి ఏఈఎస్ ముకుంద రెడ్డి బృందం రెండు చోట్ల దాడి చేసి 37 డిఫెన్స్ మద్యం బాటిల్లను సీజ్ చేశారు. పట్టుబడినటువంటి టిఫిన్స్ మద్యం బాటిళ్లు కర్ణాటక చెందినవిగా గుర్తించారు.
డిఫెన్స్ క్యాంటీన్ లో నెలవారీగా వచ్చే కోటాను కొంతమంది వద్ద బాటిల్లను కొనుగోలు చేసి ఎక్స్ సర్వీస్ మెన్ పురుషోత్తం యాప్రాల్ లో, ముప్పరపు సిద్దయ్య ఆర్మీ పర్సనల్ కౌకూర్ లో అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నట్లు ఏ ఎస్ బి ముకుంద రెడ్డి తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 75 వేలుగా ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిల్స్ పట్టుకున్న వారిలో ఏఈఎస్ ముకుంద రెడ్డితో పాటు సీఐ భరత భూషణ్ డిటిఎఫ్ ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిలు సిబ్బంది ఉన్నారు. మద్యం బాటిల్ పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ అభినందించారు.
Also Read:GV Prakash : జీవి ప్రకాష్ ను చూసి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు నేర్చుకోవాలి
మేడ్చల్ ఈఎస్ పరిధిలో హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి లేబర్ వారు తీసుకొచ్చుకునేటువంటి మద్యం బాటిల్లను మేడ్చల్ సిఐ నవనీత ఏఈ ఎస్ మాధవయ్య డిటిఎఫ్ నర్సిరెడ్డిలు సిబ్బంది కలిసి వాహనాలు, బస్సులు నిలిపే ప్రాంతాల్లో తనిఖీలు చేసి 24 మద్యం బాటిల్లను సీజ్ చేసినట్లు మేడ్చల్ ఎక్సైజ్ సిఐ నవనీత తెలిపారు. పట్టుకున్న మద్యం బాటిల్లో విలువ రూ. 48 వేలుగా ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిల్లను పట్టుకున్నటువంటి సిబ్బందిని సిఐని ఎక్సైజ్ సూపర్ రేటెండెంట్ ఎస్.కె ఫయాజుద్దీన్ అభినందించారు.