రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛలోక్తులు విసిరారు. మనం తగ్గాలి కానీ.. బుచ్చయ్య చౌదరి తగ్గరు అని అన్నారు. తనకు ఇష్టమైన నాయకులలో ఒకరు బుచ్చయ్య చౌదరి అని పవన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. బుచ్చయ్య చౌదరిని ప్రశంసించారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని, అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తనకు ఆనందంగా…
చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ను చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌తో రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు…
రాజమండ్రి (రాజమహేంద్రవరం) ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు నేడు శంఖుస్థాపన జరగనుంది. గురువారం ఉదయం 10 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు.. ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇకపై రాజమండ్రి పర్యాటక శోభను సంతరించుకోనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు…