పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కక్షతో సొంత కొడుకుని పురుగుల మందు తాగించి తండ్రి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. గణపవరం మండలం జల్లి కాకినాడకు చెందిన చూడదశి చంద్రశేఖర్, స్వరూపలకు ఆరేళ్ల సాత్విక్, సృజన ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వరూప గతంలో దుబాయ్‌లో ఉద్యోగం చేసి స్వగ్రామం చేరుకుంది. వచ్చే నెలలో తిరిగి దుబాయ్ వెళ్లేందుకు స్వరూప సిద్ధం అవ్వడంతో అందుకు చంద్రశేఖర్ నిరాకరించాడు.
స్వరూప దుబాయ్ వెళితే కొడుకు ఏడేళ్ల కొడుకు సాత్విక్‌ను హత్య చేస్తానని గతంలో పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన చంద్రశేఖర్ అన్నంత పని చేశాడు. ఒంట్లో నలతగా ఉన్న సాత్విక్‌కు తాడు కట్టిస్తానని బయటకు తీసుకువెళ్లాడు. తాడేపల్లిగూడెం శివారులోని ఒక తోటలోకి తీసుకు వెళ్లి కూల్ డ్రింక్‌లో పురుగులు మందు పోసి కొడుకుకు తాగించాడు. ఆపై తాను కూడా పురుగుల మందు తాగినట్టుగా డ్రామా ప్లే చేశాడు. ఈ ఘటనలో సాత్విక్ మృతి చెందగా.. చంద్రశేఖర్ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ ఘటనపై సాత్విక్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తన కొడుకును భర్తే హత్య చేసినట్టుగా స్వరూప ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: Uttarakhand: నదిలో పడ్డ బస్సు.. ఒకరు మృతి.. 11 మంది గల్లంతు