Panipuri : ఈ రోజుల్లో మనం తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాస్త అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం క్షణాల్లో క్షీణించిపోతుంది. అందుకే చాలామంది రెస్టారెంట్లు, హోటళ్లలో తినడానికి అంతగా ఇష్టపడటం లేదు. నిజమే, కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తయారుచేసే విధానం, పరిశుభ్రత ఏ మాత్రం బాగోదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఈ వీడియో. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ రాజ్ నగర్ దగ్గర ఉన్న కలేవా రెస్టారెంట్‌లో దారుణమైన పరిశుభ్రత లోపం బయటపడింది. అక్కడ తయారుచేస్తున్న పానీపూరిలపై బొద్దింకలు తిరుగుతుండటం చూస్తేనే వాంతులు వచ్చేలా ఉంది. ఓ కస్టమర్ తన మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
Pahalgam Terror Attack: శ్రీలంక విమానంలో “పహల్గామ్” ఉగ్రవాదులు.. కొలంబో విస్తృత తనిఖీలు..
లోకేష్ రాయ్ అనే ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ రెస్టారెంట్ పేరు, ఇక్కడ ఆహార ధరలు చాలా ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. “రాజ్ నగర్‌లోని కలేవా రెస్టారెంట్‌లో పరిశుభ్రత స్థాయిని ఒక్కసారి చూడండి. పానీపూరిల మధ్య బొద్దింకలు ఎలా తిరుగుతున్నాయో చూడండి, అవి తిన్న తర్వాత అనారోగ్యం పాలవ్వడం సహజం. వీధి వ్యాపారులు దీనికంటే మంచి పరిశుభ్రతను కలిగి ఉన్నారు. కానీ పది రెట్లు ఎక్కువ ధరకు ఆహారాన్ని అమ్మినా, ఇక్కడ బ్రాండ్‌లే ముఖ్యమని” ఆయన తన పోస్ట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలో ఒక కస్టమర్ స్వయంగా పానీపూరిపై బొద్దింకలు తిరుగుతుండటాన్ని చూడవచ్చు. వీడియో రికార్డ్ చేస్తున్న కస్టమర్ హోటల్ సిబ్బందికి వాటిని చూపించాడు. వెంటనే హోటల్ యజమానిని పిలవమని సిబ్బందికి చెప్పడం కూడా వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
ఈ వీడియో ఇప్పటికే వేలల్లో వ్యూస్‌ను సంపాదించుకుంది. దారుణమైన పరిశుభ్రతపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ “దయచేసి హోటల్ యజమానులకు పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించమని చెప్పండి, ఇది వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. మరొక యూజర్ “ఈ విధంగా ఆహారం తింటే ఆరోగ్యం దెబ్బతినడంలో ఎలాంటి సందేహం లేదు” అని అన్నారు. ఇంకొకరు “ఇది పేరుకే పెద్ద రెస్టారెంట్, పరిశుభ్రత గురించి ఏ మాత్రం పట్టించుకోరు, ఈ వీడియో చూస్తేనే వాంతులు వస్తాయి” అని తీవ్రంగా విమర్శించారు.
Vijayawada: బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే..!