తెలంగాణలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అయితే.. నిన్నటితో మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్నటికి నిన్న టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అవును అన్నట్లుగానే ఈ రోజు ఉదయం టీఆర్‌ఎస్‌కు బూర నర్సయ్య రాజీనామా చేశారు. అయితే.. త్వరలోనే అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
Also Read : Jharkhand: విద్యార్థిని బట్టలు విప్పించిన టీచర్.. అవమాన భారంతో నిప్పంటించుకున్న బాలిక
అయితే.. ఇప్పుడు కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే.. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా ఉన్నారు. అయితే.. రవికుమార్ దంపతులు సైతం కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి వెళ్లారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్‌ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.