Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు…
India VS Pakistan: భారత్, పాకిస్తాన్ ఒక రోజు వ్యవధితో 1947 ఆగస్టులో స్వాతంత్య్రాన్ని పొందాయి. ఒకప్పుడు, భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు, భారత్ ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపు, పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్లు, బాంబులు, అప్పుల్లో కూరుకుపోయింది.
పాకిస్థాన్‌ను ప్రస్తుతం అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ఒక వైపు బలూచిస్థాన్‌లో అస్థిరత నెలకొంది. మరోవైపు సింధ్ ప్రావిన్స్ లో నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. పహల్గాం ఘటన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. తాజాగా పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.
పాకిస్థాన్ లో క్షీణిస్తున్న దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అక్కడి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపడం లేదు. పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి బిలియన్ల రూపాయల రుణం తీసుకుంది.
పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. పెరిగిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విద్యుత్ ధరలకు సంబంధించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.