Pakistan: భారతదేశం పెద్ద ఎత్తున త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహిస్తోంది. ‘‘త్రిశూల్ 2025’’ ఎక్సర్‌సైజ్ పేరుతో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. గుజరాత్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర త్రివిధ దళాలు పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడు దళాలు కలిసి పాల్గొంటున్నాయి.
US-Pakistan: ఉగ్రవాద దేశానికి అమెరికా మద్దతు తెలుపుతోంది. యూఎస్ పాకిస్తాన్ సంబంధాలు నానాటికి బలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రయోజనాల కన్నా, సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పాకిస్తాన్‌తో జతకట్టి భారత వ్యతిరేక పనుల్ని చేస్తున్నాడు.
Pakistan Minister: ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. ఆ దేశ ముఖ్య నేతలు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత దాడి సమయంలో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన నవ్వుల పాలైన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత చరిత్ర తెలియకుండా మాట్లాడి నవ్వులపాలయ్యారు. ‘‘ఔరంగజేబు సమయంలో తప్పా, భారత్ ఎప్పుడూ ఐక్యం లేదు’’ అని అన్నారు.
India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తా్న్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు ప్రసంగించారు. కేంద్రంపై తీవ్ర విమర్శలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ను ప్రభుత్వం నిర్వహించిన తీరుపై పదునైన ప్రశ్నలను సంధించారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని సవాల్ విసిరారు. "డోనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపానని 29 సార్లు చెప్పారు. ఇది నిజం కాకపోతే..…
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, పాకిస్థాన్ చైనాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని పాకిస్థాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తోంది. వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చైనాలో వాంగ్ యితో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశం తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం ప్రకటించారు.
భారతదేశం-పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి చెప్పారని ఇండియాటుడే కథనంలో తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నారని మిస్రీ నొక్కిచెప్పారని పార్లమెంటరీ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాక్ వివాదాన్ని ఆపడంలో తన పాత్ర గురించి పదే పదే ప్రస్తావించారు. ట్రంప్ వాదనలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిస్రీ ఈ…
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకుంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్‌ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సామేత ప్రస్తుతం పాకిస్థాన్‌కి బాగా అబ్బుతుంది.
DGMO Meeting: భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన డీజీఎంవో స్థాయి చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసినట్టు జాతీయ మీడియా అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ఈ చర్చలు వాయిదా పడటానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (terror…
Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’’ ఘటన అనంతరం తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారతదేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొని అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలిపారు. ఈ కీలక సమావేశంలో భారత్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా దేశ మధ్యవర్తంగా శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఏర్పడిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఉల్లంఘనల పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…