Pakistan Playing XI Against Nepal for Asia Cup 2023: క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 నేటి నుంచి మొదలుకానుంది. మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ బుధవారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పటిష్ట పాక్ విజయాన్ని ఆపడం పసికూన నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఏదైనా సంచలనం జరిగితే తప్ప పాక్ విజయం ఖాయమే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
నేపాల్‌తో మ్యాచ్‌కు తమ తుది జట్టుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఈ జట్టులో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీ చేసిన యువ ఆటగాడు సల్మాన్ అలీ అగాకు చోటు దక్కింది. ఇప్పటివరకు అగా పాక్ తరఫున 9 టెస్టులు, 14 వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఇప్పటివరకు సెంచరీ చేయని అగా.. ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ లోటు తీర్చుకోనున్నాడు.
స్పెషలిస్టు బ్యాటర్ల కోటాలో బాబర్ ఆజమ్, ఫఖార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, ఇఫ్తికర్ అహ్మద్‌లకు చోటు దక్కింది. కెట్ కీపర్‌గా డెంజరస్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. పేసర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్‌లను తట్టుకుని నిలబడడం నేపాల్ బ్యాటర్లకు కష్టమే. పాక్ ఈ మ్యాచ్ అనంతరం సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఢీ కొననుంది.
Also Read:
పాకిస్తాన్ తుది జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది ,హరీస్ రవూఫ్.