గత మూడు రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే.. ఈ మూడు రోజుల్లోనే పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ తమ మధ్యవర్తిత్వం కోసం ఏదో ఒక దేశం ముందుకు రావాలని కోరుకుంటోంది. అప్పుడే ఈ దాడి, ఓటమి నుంచి తాము బయటపడగలమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. అణదాడిపై తమ ఎంపికలు తగ్గిపోతున్నాయని అంగీకరించారు.
READ MORE: Operation Sindoor: ‘నా సిందూరాన్ని బార్డర్‌కు పంపుతున్నా’.. నవ వధువు సంచలన నిర్ణయం.!
అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఇప్పుడే లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. జియో న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన సమాధానమిచ్చారు. “ప్రస్తుతానికి ఈ దాడుల్లో అణ్వాయుధాలు ఉపయోగించడంపై దృష్టి పెట్టలేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అవకాశం లేకపోలేదు. అణ్వాయుధాల వాడకం అనే ఎంపిక అందుబాటులో ఉన్నప్పటికీ.. దాని గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వాయుధాల గురించి చర్చించడం సరైంది కాదు. ఒక వేళ అణు దాడి చేస్తే.. ప్రభావం కేవలం భారత్‌పై మాత్రమే పడదు. దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉండవచ్చు. పాకిస్థాన్ అణ్వాయుధాలపై కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే బాధ్యత నేషనల్ కమాండ్ అథారిటీ (NCA)దే. ఎన్‌సీఏ ఇప్పటి వరకు సమావేశం ఏర్పాటు చేయలేదు.” అని ఆసిఫ్ అన్నారు.
READ MORE: IND PAK War: పాక్ ఎన్ని డ్రోన్స్, క్షిపణులను ప్రయోగించినా భారత్ ఇట్టే కూల్చేస్తోంది.. కారణాలేంటి?