భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్‌ల నుంచి ఫిరంగి దాడులు జరిగినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది.
గత మూడు రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే.. ఈ మూడు రోజుల్లోనే పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ తమ మధ్యవర్తిత్వం కోసం ఏదో ఒక దేశం ముందుకు రావాలని కోరుకుంటోంది. అప్పుడే…
సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం పాకిస్థాన్‌ను ఆగ్రహానికి గురిచేసిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నాడు. నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భుట్టో పేర్కొన్నాడు. సింధు నాగరికతకు పాకిస్థాన్ నిజమైన సంరక్షకులం తామే అని.. సింధూ నదిలో నీరు పారకపోతే.. భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేశాడు. "సింధు నది మనదే అవుతుంది. మన నీరు దాని గుండా ప్రవహిస్తుంది. లేదా వారి(భారత్) రక్తం…