Rajya Sabha Election: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ.. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తదితర ఇతర నేతలు పాల్గొన్నారు.. ఇక, నామినేషన్ వేసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు కూటమి రాజ్యసభ అభ్యర్థి పాకా సత్యనారాయణ… బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎంకు వివరించారు.. కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగింది.. ఈ సమావేశంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు..
Read Also: Awake At Midnight: అర్ధరాత్రి దాటినా నిద్ర పొవట్లేదా? ఇక ఈ సమస్యలతో సతమతవాల్సిందే!
కాగా, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఏపీ నుంచి రాజ్యసభకు ఖాళీ ఏర్పడింది.. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇవాళ్టితో నామినేషన్ దాఖలు గడువు ముగియనుంది.. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి రాజ్యసభ బరిలో నిలిచేది ఎవరు? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. టీడీపీ-జనసేన.. బీజేపీకి ఆ స్థానాన్ని వదిలేసింది.. దీంతో.. పార్టీతో సుదీర్ఘ కాలం పనిచేస్తూ వస్తున్న పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడం.. ఈ రోజు నామినేషన్ వేయడం జరిగిపోయాయి.. 1980 నుండి నేటి వరకు భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తగా, పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ మరియు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనేక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, భీమవరం మునిసిపల్ కౌన్సిలర్‌గా ప్రజల మన్ననలు పొంది, ఓబీసీ సంఘాల నాయకుడిగా బీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ, రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పాక వెంకట సత్యనారాయణ ఎన్నిక లాంఛనమేకానుంది..