భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన సోనీ LIV, ‘బ్లాక్ వైట్ & గ్రే: లవ్ కిల్స్’, ‘ది వేకింగ్ ఆఫ్ ది నేషన్’ వంటి సూపర్ హిట్ షోల తర్వాత, ఇప్పుడు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘కన్‌ఖజురా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డయాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మే 30, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.
Aslo Read: Chiranjeevi : డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..
‘కన్‌ఖజురా’ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు, ఇది అపరాధ భావన, రహస్యాలు, ప్రతీకార జ్వాలలతో కూడిన కథను వెల్లడిస్తోంది. ఈ సిరీస్ మాక్స్ (మోహిత్ రైనా) మరియు అషు (రోషన్ మాథ్యూ) అనే ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది. వారు తమ జ్ఞాపకశక్తిని కోల్పోయి, వాస్తవికతను అర్థం చేసుకోలేక, చీకటి గతంతో సంఘర్షిస్తారు. ఈ సిరీస్ ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ ఆధారంగా రూపొందింది.
Also Read:Robinhood: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తున్న ‘రాబిన్ హుడ్’
నటి సారా జేన్ డయాస్ మాట్లాడుతూ, “‘కన్‌ఖజురా’ ఒక ఆకర్షణీయమైన కథను కలిగి ఉంది. అపరాధం, కుటుంబం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి బహుముఖ అంశాలతో ఈ సిరీస్ నిండి ఉంది. నిషా పాత్ర చాలా కీలకమైనది, ఇలాంటి బహుపాత్రాత్మక పాత్రను పోషించడం సవాలుతో కూడుకున్నది” అని తెలిపారు.