ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ..
ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. భీమవరంకు చెందిన సత్యనారాయణ.. ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు రేసులో వినిపించినా.. చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. విజయసాయి…