Honda X-ADV: అడ్వెంచర్ రైడింగ్‌కు అనుగుణంగా స్టైలిష్ లుక్ తో X-ADV లాంచ్..!
- మార్కెట్‌లో మాక్సీ స్కూటర్ X-ADV లాంచ్ .
- అడ్వెంచర్ రైడింగ్‌కు అనుగుణంగా స్టైలిష్ లుక్ తో Honda X-ADV
- రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda X-ADV:హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తాజాగా భారత మార్కెట్‌లో తన మాక్సీ స్కూటర్ X-ADV ని లాంచ్ చేసింది. ఇది ఒక అడ్వెంచర్ మోటార్‌సైకిల్ శైలిని, మాక్సీ-స్కూటర్ సౌలభ్యాన్ని మిళితం చేస్తూ రూపొందించబడింది. ప్రస్తుతం ఈ స్కూటర్ సంబంధించి Honda BigWing డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, డెలివరీలు మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి.
Read Also: Budget Smartphones: కేవలం 15 వేలకే 6000 mAh బ్యాటరీ, అద్భుత కెమెరా ఫీచర్లతో లభించే ఫోన్స్ ఇదిగో..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇంజిన్ :
Honda X-ADVలో 745cc లిక్విడ్-కూల్డ్ SOHC 8-వాల్వ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,750 RPM వద్ద 57hp శక్తిని, అలాగే 4,750 RPM వద్ద 69 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది పవర్, పనితీరు పరంగా క్లాస్‌లో బెస్ట్ అని చెప్పవచ్చు.
డిజైన్, హార్డ్‌వేర్:
X-ADVను పూర్తిగా అడ్వెంచర్ రైడింగ్‌కు అనుగుణంగా రూపొందించారు. ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్ మీద నిలబడి ఉండే ఈ స్కూటర్‌లో డ్యూయల్ LED హెడ్‌లైట్లు, డే టైం రన్నింగ్ లైట్లు (DRL) ఉన్నాయి. స్కూటర్ ముందు వైపు 17 అంగుళాల చక్రం, వెనుక 15 అంగుళాల స్పోక్ వీల్ ఉంటుంది. సస్పెన్షన్ కోసం 41mm USD ఫోర్క్‌లు ముందువైపు, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ వెనుకవైపు ఉన్నాయి. బ్రేకింగ్ పరంగా చూస్తే.. ముందు డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్ పిస్టన్ కాలిపర్లు, 296mm డిస్క్‌లు, వెనుకవైపు సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో 240mm డిస్క్ ఉంటుంది.
ఫీచర్లు:
Honda X-ADVలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 5 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్ప్లే, Honda RoadSync యాప్ సపోర్ట్ లో భాగంగా కాల్స్, SMS అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్, వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. అలాగే రైడ్-బై-వైర్ టెక్నాలజీ, స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ లాంటి నాలుగు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇంకా రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.
ధర:
Honda X-ADV రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ అయింది. డెలివరీలు జూన్ 2025 నుండి ప్రారంభం కానున్నాయి/ అలాగే ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొత్తంగా అడ్వెంచర్ శైలిని ప్రేమించే స్కూటర్ రైడర్లకు Honda X-ADV ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్ కలబోతతో ఇది మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సాధించగలదు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..