ఉమీద్ పోర్టల్‌లో 216,905 వక్ఫ్ ఆస్తులను ఆమోదించారు. భారత్ లో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడానికి తీసుకొచ్చిన కేంద్ర పోర్టల్ అయిన ఉమీద్, ఆరు నెలల గడువు తర్వాత, డిసెంబర్ 6వ తేదీ శనివారం క్లోజ్ అయ్యింది. ఈ నిర్ణయం UMEED చట్టం, 1995, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నారు. ఈ పోర్టల్‌ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జూన్ 6, 2025న ప్రారంభించారు. నిర్ణీత గడువులోపు, 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పోర్టల్‌లో ప్రారంభించారు. వీటిలో 216,905 ఆస్తులను నియమించిన అప్రూవర్లు ఆమోదించారు.
Also Read:Lok Sabha: నేడు లోక్‌సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ.. రచ్చ తప్పదు!
213,941 ఆస్తులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. వెరిఫికేషన్ సమయంలో, 10,869 ఆస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మంత్రిత్వ శాఖ వక్ఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం, ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో 86,345 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కింద అప్ లోడ్ ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 52,917 ఆమోదించబడిన ఆస్తులు ఉన్నాయి. ఈ ప్రచారం సందర్భంగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర/యూటీ వక్ఫ్ బోర్డులు, మైనారిటీ విభాగాలతో నిరంతర వర్క్‌షాప్‌లు, శిక్షణా సెషన్‌లను నిర్వహించింది.
Also Read:Telangana Rising Global Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం
అప్‌లోడ్ ప్రక్రియపై వక్ఫ్ బోర్డులు, రాష్ట్ర/యూటీ అధికారులకు ఆచరణాత్మక శిక్షణ అందించడానికి ఢిల్లీలో రెండు రోజుల మాస్టర్ ట్రైనర్ వర్క్‌షాప్ కూడా జరిగింది. సీనియర్ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ వివిధ రాష్ట్రాలకు పంపించారు. దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతీయ సమావేశాలు జరిగాయి. అప్‌లోడ్ చేసేటప్పుడు తలెత్తే సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఒక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు.