వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్‌లో అన్ని వక్ఫ్ ఆస్తులను (‘వక్ఫ్ బై యూజర్’ హోదా ఉన్న వాటితో సహా) నమోదు చేయడానికి ఆరు నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన…
Waqf Act: దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కి రంగం సిద్ధమైంది. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న ‘‘ఉమీద్’’ పోర్టల్‌ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి’ అనే పోర్టల్ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళిక ప్రకారం, అన్ని వక్ఫ్ ఆస్తుల్ని ఆరు నెలల్లోపు పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆస్తుల పొడవు,…