బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. ఆ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు హీరోగా నిలబెట్టాయి.. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాలింగ్ సహస్ర లో హీరోగా నటించాడు.. మొదటి సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కాస్త నిరాశని మిగిల్చింది..
బుల్లితెర పై కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. ‘జబర్దస్త్’లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు. టీమ్ లీడర్ గా స్కిట్స్, యాంకర్‌గా ఈవెంట్స్ హోస్ట్ చేశాడు. ప్రస్తుతం హీరోగా మాత్రమే టచేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు ‘గాలోడు’ అనే మాస్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు.. ఇటీవల వచ్చిన కాలింగ్ సహస్ర సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.. కాస్త జనాలను కన్ఫ్యుజన్ లో పడేసింది..
టెక్నికల్ అంశాలతో తీసిన ఈ సినిమా.. రెగ్యులర్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఫ్లాప్‌గా నిలిచింది. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు బాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.. ఇక ఈ వారం సినిమాలు కూడా ఎక్కువగానే విడుదల అవుతున్నాయని తెలుస్తుంది.. ఇక ప్రస్తుతం సుధీర్ మరో సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే అనౌన్స్ చెయ్యబోతున్నాడని సమాచారం..