స్టాక్ మార్కెట్ ఈరోజు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల కారణంగా.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది, నిఫ్టీ కూడా 329 పాయింట్లకు చేరుకుని నష్టాల్లో ముగిసింది. ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ క్షీణతలో రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి. అంతేకాకుండా.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అమ్మకాలపై ఎక్కువ ప్రభావం చూపాయి. సుమారు మూడు శాతం పడిపోయాయి. అంతేకాకుండా.. దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లకు రూ.8 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో లిస్టెడ్ షేర్ల మార్కెట్ క్యాప్ రూ.366 లక్షల కోట్లకు పడిపోయింది.
Read Also: Himanta Biswa Sarma: అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత.. రాహుల్ పై కేసు నమోదుకు సీఎం ఆదేశం
గ్లోబల్ మార్కెట్లు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్‌లో మాత్రం క్షీణత నెలకొంది. ఫార్మా, ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా.. బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ షేర్లు నష్టపోయాయి. కాగా.. ఈ పతనానికి పశ్చిమాసియా, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొందని నిపుణులు చెబుతున్నారు. కాగా.. NSEలో సిప్లా, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముగిశాయి.
Read Also: Ap DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఉపాధ్యాయ ఉద్యోగాలు..