గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వీ కన్వెన్షన్ హాల్ పహారి గోడ సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి గా షెడ్లపై గోడ కూలడంతో…
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఇద్దరు వ్యక్తులు. గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. దుబ్బగూడెం కు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్య యూరియా టోకెన్ల కోసం బొద్దుగొండ వస్తుండగా ద్విచక్ర వాహనం, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బానోత్ వాల్య మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు…
ముంబైలో హీరోయిన్ ఊర్మిళ కొఠారే కారు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మెట్రో ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికుడు మృతిచెందాడు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఊర్మిళా కొఠారే డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడని పోలీసులు పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉనాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత.. ఆయిల్ కిందకు కారి మంటలు వ్యాపించాయి. దీంతో పలు వాహనాలు, దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. హరోలి ప్రాంతంలోని తహ్లివాలా కస్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కాగా.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే ఆ పడవలో మొత్తం ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.