ఎన్నో ఏళ్ల కల అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. సోమవారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట చేశారు. కాగా.. ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారు. అంతేకాకుండా.. ప్రాణప్రతిష్ట జరగగానే రామభక్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: BRS : ఫిబ్రవరి 3 నుంచి బీఆర్‌ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు
ఈ వీడియోలో ఓ టేబుల్ డ్రింక్స్, స్నాక్స్ ఉండగా రెండు దేశాల ఆర్మీ నిలబడి ఉన్నారు. ఇండియన్ ఆర్మీ.. ‘జై శ్రీరామ్’ నినాదాన్ని ఎలా పలకాలో చైనా భద్రతా దళాలకు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. భారత సైనికులు పలికినట్లుగా చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియదు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ‘ఎక్స్’లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
INDIAN ARMY WITH Chinese ARMY.
Jai shree Ram🚩pic.twitter.com/P8L3fsMSc7
— Dhruv Tripathi (@Dhruv_tr108) January 22, 2024
Read Also: Himanta Biswa Sarma: అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత.. రాహుల్ పై కేసు నమోదుకు సీఎం ఆదేశం
భారత్-చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.