Once Again Bandi Sanjay Fies on CM KCR
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే మూడు విడతలుగా బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించారు. అయితే నేడు నాల్గవ విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పోలీస్‌లను అవమాన పరిచే విధంగా అస్సాం సీఎం విషయంలో టీఆర్‌ఎస్ చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబం వాటాలు అడగడంతో ఇక్కడి నుండి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లి పోతున్నాయన్నారు. 8 సంవత్సరాలు అయిన డ్రైనేజ్‌లను మార్చలేదని, జీడిమెట్ల నీళ్ళు పంపుతా కేసీఆర్ స్నానం చెయ్యి అంటూ ఆయన విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇవ్వాలని అడిగితే మతతత్వమా కేసీఆర్ చెప్పాలన్నారు. అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాము… మతతత్వం గురించి సీఎం మాట్లాడుతున్నారు.. హిందువులకు బిక్షమెత్తుకునే పరిస్థితి వస్తుంది… భరిద్దమా.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం.. జాతీయ సమైక్యత దినం పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్‌ను పాకిస్తాన్ లో కలపాలని చూసిన వాని సమాధి ముందు మోకరిల్లిన దుర్మార్గుడు కేసీఆర్….కాషిం చంద్రశేఖర్ రజ్వీ.. ప్రపంచ రాష్ట్ర సమితి అని పెట్టుకో ఎవరు దేకరు.. కేఏ పాల్‌తో కలిసి తిరుగు.. ట్విట్టర్ టిల్లు చెప్పాలి… దావోస్‌కి వెళ్లి 4 వేల కోట్లు తెచ్చారు అట పక్క రాష్ట్రం కర్ణాటక 60 వేల కోట్లు తెచ్చింది.. ముప్పై గ్రామాల కరెంటు నీ కేసీఆర్ తన ఫార్మ్ హౌస్‌కి వాడుకున్నాడు అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి.. ఈ కేంద్ర బిల్లులో ఎక్కడ అయిన మోటర్ లకు మీటర్ లకు పెట్టాలని ఎక్కడ అయిన ఉంటే రాజీనామ చేసేందుకు సిద్ధం అని ఆయన సవాల్ విసిరారు. నీకు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయాలి అంటూ ఆయన మండిపడ్డారు.