CCTV Video: ముంబై సమీపంలోని వసాయ్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానిక నివాసితుల ప్రకారం.. ఈ దాడి పంది మాంసం వ్యాపారం నేపథ్యం రెండు గ్రూపుల మధ్య జరిగిన వివాదమని తెలిస్తోంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ పరిసరాల్లో ఈ దాడికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియోలో ఓ పికప్ వ్యాన్ మరో వ్యాన్‌ను ఢీకొట్టడం, దానిని ఆపడం కనిపిస్తుంది. అనంతరం ఓ వ్యక్తిని వాహనంలో నుంచి బయటకు లాగి కత్తితో బాగా కొట్టారు. దాడి చేసిన వ్యక్తులు కత్తిని ఊపుతూ, తుపాకీ చేతబట్టి చుట్టుపక్కల వారిని భయపెట్టడం కనిపిస్తుంది. ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేందుకు దుండగులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దాడికి గురైన వ్యక్తిని హర్జీత్ సింగ్‌గా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దాడి తర్వాత దాడి చేసిన వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హర్జీత్ సింగ్, నిందితుల కోసం అనేక బృందాలను ఏర్పాటు చేశారు. హర్జీత్ సింగ్‌తో ప్రయాణించిన మరో ఇద్దరిపై నిందితులు దాడి చేయలేదు. ఇదంతా విజువల్స్‌లో కనిపించింది. ఘటనా స్థలి నుంచి హర్జీత్ సింగ్ వాహనం, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి వచ్చిన దృశ్యాలు, క్లూస్ కోసం పోలీసు అధికారులు స్పాట్‌ను పరిశీలించారు.
Rohingya Stranded: నడి సముద్రంలో చిక్కుకున్న 100 మందికి పైగా రోహింగ్యాలు..
హర్జీత్ సింగ్‌ను రక్షించడానికి ప్రయత్నించిన వారిని తుపాకీతో హెచ్చరించారని స్థానిక నివాసి జయేంద్ర పాటిల్ తెలిపారు. కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోవడానికి సాహసించలేదన్నారు.ఈ వివాదం పంది మాంసం వ్యాపారంతో ముడిపడి ఉంటుందని ఆయన అన్నారు. ‘వారు పంది మాంసం వ్యాపారులు. ఈ దాడి దానితో ముడిపడి ఉండవచ్చు.’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చేసిన వారు హర్జీత్ సింగ్‌ను తమ పికప్ వ్యాన్‌లోకి ఎక్కించుకుని వెళ్లిపోయారని జయేంద్ర పాటిల్ చెప్పారు.
#WATCH | Maharashtra: Case registered against 3 unidentified persons after a scuffle broke out b/w 2 groups in Palghar's Naik Pada y'day. A person, HS Dadu, got injured after being attacked with a sword. A sword & car recovered from the spot.Probe on: Waliv Police
(CCTV Visuals) pic.twitter.com/Jt6TRiCPtG
— ANI (@ANI) December 21, 2022