ప్రపంచ ఆర్ధిక మాన్యం వెంటాడుతున్న వేలా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. దీంతో.. ఉద్యోగులను యదేచ్ఛగా తొలగిస్తున్నారు. ఒకదాని తర్వాత మరో కంపెనీ భారీగా ఉద్యోగులకు ఇంటికి సాగనంపుతున్నాయి. ఇక తాజాగా ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యండ్ వస్తువులను విక్రయించే ఓఎల్‌ఎక్స్ గ్రూప్ సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థలో పది వేల మంది పనిచేస్తుండగా పదిహేను వందల మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఓఎల్‌ఎక్స్ గ్రూప్ తొలగింపు నిర్ణయంతో కంపెనీ ఆటో బిజినెస్‌పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ ఆపరేషన్ టీంలో పని చేసే ఉద్యోగుల పైన తొలగింపుల ప్రభావం ఉండనుంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తు ఆశయాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటునట్లు స్పష్టం చేసింది ఓఎల్‌ఎక్స్.
Also Read : Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య
ఇదిలా ఉంటే.. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం, డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ మరోసారి ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. కొన్ని నెలల క్రితమే వేలాది మందిని పీకేసిన సంస్థ.. మరోసారి 6,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. గతేడాది రెస్పిరేటరీ డివైజ్‌లను భారీగా రీకాల్ చేసింది. ఆ ప్రభావం సంస్థపై తీవ్రంగా ఉంది. ఇంకా కొనసాగుతుండటమే ఉద్యోగాల కోతకు కారణమవుతున్నట్లు సమాచారం. ఈ రెస్పిరేటరీ సామగ్రిని రీకాల్ చేసిన తర్వాత ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ఇది రెండోసారి. ఫిలిప్స్ సంస్థ గత ఏడాది 2022, అక్టోబర్‌లో 4,000 మందిని తొలగించింది. గతంలో మాదిరి సంస్థను మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు డచ్ సంస్థ ఫిలిప్స్ తెలిపింది. ఈ రీకాల్ తో కంపెనీ మార్కెట్ విలువ 70 శాతం మేర తగ్గిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించాలని సంస్థ ప్రణాళికలు చేస్తోంది. 2025 నాటికి మిగిలిన 50 శాతం వర్క్ ఫోర్స్ పై నిర్ణయం తీసుకోనుంది.
Also Read : Union Budget 2023: సామాన్యులకు శుభవార్త.. పక్కా మిడిల్ క్లాస్ బడ్జెట్.. వాటి మీదే సీతమ్మ ఫోకస్?