Komatireddy Rajagopal Reddy: నూతన అసెంబ్లీ నిర్మాణంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన అసెంబ్లీ అవసరమని.. సచివాలయం పక్కన ఎన్టీఆర్ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుందన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ నిర్మాణానికి అవసరమైతే ఎఫ్‌టీఎల్ పరిధిని కుంచించవచ్చన్నారు. గోదావరి జలాలతో జంట నగరాలలోని కుంటలను నింపొచ్చన్నారు. సచివాలయం, అసెంబ్లీ, అమరవీరుల స్థూపం, హుస్సేన్ సాగర్ ఒడ్డున చూడ చక్కగా ఉంటాయన్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కన ఉంటే పాలన పరంగా బాగుంటుందన్నారు. తన మంత్రి పదవి అనేది అధిష్టానం చేతుల్లో ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: HMDA: సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ