ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తుంది.. ఇక, మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది..
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఇవాళ కేబినెట్‌లో నిర్ణయం జరిగిందన్నారు.. సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు..
రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.. కొందరు కోవర్టులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.. టీడీపీలోని చిన్న చిన్న విబేధాలకు కోవర్టులు ఆజ్యం పోస్తున్నారు.. టీడీపీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి కొలుసు పార్థసారథి..
ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. వైసీపీ ఖాళీ అవుతోందన్న ఆయన.. పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు..
కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వివరించారు..
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో ప్రస్తుత మంత్రి పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారా? అంటే... అవుననే అంటున్నారట ఏపీ పొలిటికల్ పరిశీలకులు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. అదే ప్రోగ్రామ్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటెండ్ అయ్యారు. ఇక విగ్రహావిష్కరణకు వెళ్ళే ముందు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి.. రాష్ట్ర ఆర్ధిక స్ధితి మెరుగు పరచడానికి కావాల్సిన పాలసీలు ఆమోదించారు.. గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, ఎకానమీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అభివృద్ధి కి గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.