ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుండి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. దీని కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని.. సిరీస్‌లోని మొదటి రెండు వన్డేల కోసం భారత జట్టులో భారీ మార్పులు చేశారు. తొలి రెండు మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనుండగా.. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే.. తొలి రెండు వన్డేల నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు.
TS TRT 2023 : ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్..
అయితే మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ బరిలోకి దిగనున్నారు. దాంతో పాటు మూడో వన్డేలో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా కూడా మొదటి రెండు వన్డేలలో ఆడడు. మూడో వన్డే నుంచి హార్దిక్ కూడా తిరిగి మ్యాచ్ ఆడనున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా విశ్రాంతి తర్వాత మూడో వన్డే నుంచి టీమ్ లోకి రానున్నాడు. ప్రపంచ కప్ 2023 కోసం ప్రకటించిన మూడో వన్డేకి అదే జట్టును ఉంచారు. ఇదిలా ఉంటే.. స్టార్ స్పిన్నర్ అశ్విన్‌ను మూడు వన్డేల కోసం జట్టులో చేర్చారు. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్‌కు తొలి రెండు వన్డేల జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కింది. మూడో మ్యాచ్‌లో అక్షర్‌ను జట్టులో చేర్చినప్పటికీ.. మూడో వన్డే కోసం అతనితో పాటు వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఉంచారు.
ICC Rankings: టీమిండియాకు భారీ షాక్.. వన్డేల్లో నంబర్ వన్‌గా పాకిస్థాన్
ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్..
ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్., వాషింగ్టన్ సుందర్.
🚨 India's squad for the IDFC First Bank three-match ODI series against Australia announced 🚨#TeamIndia | #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023