మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్ళీ ఆవేశానికి లోనయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పుంగనూరు పుడంగి పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకోవాలి. పుంగనూరులో నీ కథ తేలుస్తా. ….ఇది బిగినింగ్ మాత్రమే. నువ్వూ ఒక సైకోలా మారావు. ….14 ఏళ్లు నేను అనుకుని ఉంటే ఈ జిల్లాలో తిరిగి ఉండే వాడివా? నీఇష్ట ప్రకారం అరాచకాలు చేస్తావా. …..నీ డెయిరీకి మాత్రమే పాలు పోయాలా? …నీ తాత జాగీరా ఖబడ్డార్, నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. కుప్పం పంచాయితీ ఎన్నికలు కాదు. ఇప్పుడు రా నీ సంగతెంటో కుప్పంలో చూస్తాను అన్నారు చంద్రబాబునాయుడు. కుప్పంలో బట్టలు ఇప్పిస్తా….మైనింగ్, ఇసుకకు కప్పం కట్టాలా? కుప్పంలో ఫైన్ లు వేసి రూ. 50 కోట్లు కప్పం ముందుగా ఫైన్ లు వేయడం మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తావా? ఇప్పటిదాకా రాజకీయమే చూశాను, ఇప్పుడు రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులతో పోరాటం చేస్తున్నా అన్నారు. కరడు గట్టిన నేరస్తుడిలా మారిపోయారు. నేను ఎవ్వరిని వదిలిపెట్టను అన్నారు చంద్రబాబునాయుడు.
మాజీ ఎంపీ మానవత్వం.. మహిళను కాపాడిన బూర నర్సయ్యగౌడ్

ఒక్కోసారి రోడ్డుమీద వెళ్ళేటప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కొందరు మనకెందుకులే అని వాటిని వదిలేస్తారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాపాయస్థితిలో వుంటే అసలు పట్టించుకోరు. ఒకవేళ వారిని ఆస్పత్రికి చేరిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని జనం వదిలేస్తారు. కానీ కొందరు అలా కాదు.. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే.. ప్రమాదాల బారిన పడితే వెంటనే స్పందిస్తారు. అందునా ఒక డాక్టర్ గా ఉన్న రాజకీయ నాయకుడు అయితే.. వైద్యం కూడా అందిస్తారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్వయానా ఒక డాక్టర్. రాజకీయ నాయకుడిగానే కాదు డాక్టర్ గా ఎందరికో వైద్యం అందించారు. తాజాగా ఆయనలో ఆ డాక్టర్ బయటికి వచ్చారు. ఒక మహిళ ప్రాణం కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పట్టణంలో నాగార్జున సాగర్ హైవేపై ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది ఒక మహిళ. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయంతో స్పృహ కోల్పోయింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వెంటనే స్పందించారు. ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి క్షేమంగా తరలించి ప్రాణాలను కాపాడి వృత్తి ధర్మాన్ని పాటించారు.
చంద్రబాబుని చూస్తే జగన్ కి అంత భయమా?

ఏపీలో పాలనపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు. నిన్న కుప్పంలో జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజు. అసలు రాష్ట్రం భారతదేశంలో ఒక భాగమా కాదా అనే సందేహం కలుగుతుంది.ఒక శాసన సభ్యుడు గా చంద్రబాబు కుప్పంలో తిరగడానికి ఎవరు పర్మిషన్ కావాలని అడుగుతున్నాను. ప్రతిపక్షం తిరగకుండా చేసేందుకే జగన్ చీకటి జీవోలను తీసుకొచ్చారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో ఈ చీకటి జీవోలే నిదర్శనం.గత సంవత్సర కాలం నుంచి ప్రజల వద్దకు చంద్రబాబు వచ్చి ధైర్యం చెబుతున్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు నడిపేందుకు సర్వశక్తులు దారపోస్తానంటూ ప్రజలకి ధైర్యం ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. బాబు సభలకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక చంద్రబాబుని తిరగకుండా కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పులను బాబు ఎత్తి చూపుతున్నారు.ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చారో అప్పుడే రాష్ట్రాన్ని కూల్చటం మొదలు పెట్టారు. కొంతమంది పోలీసులు వైకాపా కార్యకర్తలులా పనిచేస్తున్నారు. ఒక పార్టీకి పోలీసులు కొమ్ము కాయడం బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. బరితెగించి పోలీసులు వ్యవహరిస్తున్నారు.ఒక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్లినా పోలీసులు సహకరించి సరైన బందోబస్తు కల్పించాలి. పోలీసులు బాబు సభలకు సరైన భద్రత కల్పించి ఉంటే ఎలాంటి ఘటనలూ జరిగేవి కావు.చంద్రబాబును జనాలకు దూరం చేస్తే మళ్లీ గెలుస్తారని జగన్ భ్రమలో ఉన్నారు.ఆయన ఎన్ని చీకటి జీవోలు తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఎంత ఖూనీ చేసినా టీడీపీని ఆపలేరు.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 10వేలకు ఫంక్షన్ హాల్స్

హైదరాబాద్ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) శుభవార్త చెప్పింది. జీహెచ్‌ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన బహుళ ప్రయోజన ఫంక్షన్ హాళ్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసింది. ఇటువంటి సౌకర్యాలు హైదరాబాద్‌లోని పట్టణ పేదలకు చౌకైన ప్రత్యామ్నాయాలను అందించాయి. వారు ఇప్పుడు సరసమైన ధరలకు వివాహాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించగలుగుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్‌ల యాజమాన్యంలోని బాంకెట్ హాల్‌లతో పోలిస్తే తక్కువ ఛార్జీకి లీజుకు ఇవ్వబడింది.కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఫేజ్ 4లోని జీహెచ్‌ఎంసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి సరసమైన చార్జీల కారణంగా స్థానికులు వివాహాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వెళ్లే గమ్యస్థానాలుగా మారాయి. ఇటువంటి సౌకర్యాలకు డిమాండ్ పెరగడంతో జీహెచ్‌ఎంసీ కూడా చింతల్‌లోని భగత్ సింగ్ నగర్‌లో మరో భారీ మల్టీ-పర్పస్ ఫంక్షన్ హాల్‌ను తెరవడానికి సిద్ధంగా ఉంది. రూ. 3.33 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయబడిన, ఖరీదైన ఫంక్షన్ హాల్ పరిసరాల్లోని నివాసితుల వివిధ అవసరాలను తీర్చేందుకు అనేక సౌకర్యాలను అందిస్తుంది.
సైకో కథతో ఏం చెప్పబోతున్నారు!?

బాబు పెదపూడి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం `రివేంజ్`. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్ర దర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మద్రాస్ నుంచి ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. తను మంచి రైటర్, డైరెక్టర్. సినిమానే ప్రాణంగా బ్రతికే వ్యక్తి. ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది” అని అన్నారు. మరో దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ, ”హీరో కమ్ ప్రొడ్యూసర్ బాబు గారితో నాకు 12 ఏళ్ల పరిచయం. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న వ్యక్తి. దర్శకుడు శ్రీనివాస్ ఒక మంచి కథతో ఈ సినిమా రూపొందించారన్న విషయం ట్రైలర్ చూశాక అర్థమైంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
చైనాలో కోవిడ్ కల్లోలం… ఆస్పత్రుల్లో బెడ్లు లేవు.. బ్లాక్ మార్కెట్‌లో మందులు..

చైనాలో కోవిడ్ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. అక్కడి లక్షల్లో ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. మరణాలు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని బీజింగ్ లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ లోని అన్ని ఆస్పత్రుల్లో బెడ్లు అన్ని నిండిపోయాయి. రోగులు హాల్ లో స్ట్రెచర్లపై పడుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీల్ చైర్ లో ఆక్సిజన్ తీసుకుంటున్నారు కొందరు రోగులు. రోగుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ పడకలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చికిత్స తీసుకుంటున్న వారిలో వృద్ధులే అధిక మంది ఉంటున్నారు. మరోవైపు రోగుల సంఖ్య పెరగడంతో వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందిపై ఒత్తిడి పడుతోంది.ఇక శ్మశాన వాటికలు కూడా కోవిడ్ రోగుల శవాలతో నిండిపోతున్నాయి. ఓమిక్రాన్ బీఏ.5.2, బీఎఫ్.7 వేరియంట్లు చైనాను అల్లకల్లోలం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే ఈ రెండు వేరియంట్ల వల్ల దేశంలో రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల చైనా ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగింది.
ప్రభాస్ కంటే ముందే పెళ్ళిచేసుకోబోతున్న యంగ్ హీరో

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ ఒకడు. ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ విజయాలను అందుకొంటున్నాడు. ఇక గతేడాది ఒకే ఒక జీవితం చిత్రంతో అభిమానులను మెప్పించిన శర్వా ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారాడు. ఇక ఇటీవలే నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో సందడి చేసిన ఈ కుర్ర హీరో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు శర్వానంద్.. అడివి శేష్, ప్రభాస్ తరువాత అని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో కుర్ర హీరో పెళ్ళికి ఇంకా టైమ్ ఉందిలే అనుకున్నారు. అయితే శర్వా మాత్రం ఈ ఏడాది పెళ్ళికి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. శర్వా కొన్నేళ్ల నుంచి ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయిగా సమాచారం అందుతోంది. ఇరు కుటుంబ వర్గాలు వీరి పెళ్లికి ఓకే అనడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
సెన్సెక్స్ క్రాష్.. 1200 పాయింట్లకు పైగా మటాష్..

దేశీయ స్టాక్ మార్కెట్ తీరు మారలేదు. రెండు కీలక సూచీలు కూడా నిన్నటిలాగే నష్టాల బాటలోనే నడిచాయి. ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ లాస్‌లతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ రంగంలో షేర్ల కొనుగోళ్లు పెరగటంతో ఇంట్రాడే నష్టాల నుంచి కాస్తయినా కోలుకోగలిగాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 60 వేల 50 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ50 కూడా 18 వేల మార్క్ నుంచి పతనమై 17 వేల 950కి డౌన్ అయింది. సెన్సెక్స్ నిన్న, ఇవాళ రెండు రోజుల్లోనే 12 వందలకు పైగా పాయింట్లు కుప్పకూలటం గమనించాల్సిన విషయం. సెన్సెక్స్ చివరికి 304 పాయింట్లు కోల్పోయి 60 వేల 353 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 17 వేల 992 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ఇంజనీర్స్ ఇండియా, సియెట్, అపోలో టైర్స్ అధికంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఏబీబీ, బజాజ్ ఫైనాన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఫర్వాలేదనిపించాయి. నిఫ్టీలో ఎక్కువ శాతం స్టాక్స్ రాణించాయి. సిప్లా, బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ విన్నర్స్‌గా నిలిచాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు నీరసించాయి.