కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహిస్తోంది. దీని కారణంగా ఈ విభాగంలో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అలాంటి స్కూటర్లను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే చట్టరీత్యా నేరం. ఒక్కోసారి జరిమానాలతో పాటు జైలు శిక్షలకు కూడా గురికావాల్సి వస్తుంది. మరి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు.
డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొన్ని స్కూటర్లు ఉన్నాయి. వాటి ధర కూడా రూ.70 వేల లోపే లభిస్తున్నాయి. భారతదేశంలో, ఏ రకమైన వాహనాన్ని నడపాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. కానీ గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాహనాలను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. అలాంటి స్కూటర్ల మోటార్ పవర్ కూడా 250 కిలోవాట్ల కంటే తక్కువగా ఉంటుంది.
జెలియో లిటిల్ గ్రేసీ
జెలియో లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. తక్కువ వేగం విభాగంలో వచ్చే ఈ స్కూటర్‌ను గరిష్టంగా 25 కి.మీ. వేగంతో నడపవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 75 కి.మీ.ల రేంజ్‌ను పొందుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 49500.
యులు విన్
యుకు విన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా యులు ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందిస్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫిక్స్‌డ్ బ్యాటరీకి బదులుగా రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. దీనిని రీప్లేస్ చేయవచ్చు. దీని ధర రూ. 55555.
Also Read:Mahabubabad: మునిగలవేడులో బావిలో పడ్డ ఆటో.. ఒకరి మృతి
కైనెటిక్ గ్రీన్ జింగ్
కైనెటిక్ గ్రీన్ కైనెటిక్ గ్రీన్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విక్రయిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 75990.
Also Read:P Chidambaram: కాంగ్రెస్ నేత “పాకిస్తాన్ అనుకూల” వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
ఒకినావా R30
ఒకినావా R30 భారతీయ మార్కెట్లో తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత దీనిని 60 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 61998.