Dussehra 2025 – Durga Navratri: దసరా ఉత్సవాలకు సమయం రానేవచ్చింది.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో.. ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. సెప్టెంబర్ 22న దసరా ఉత్సవాలు ప్రారంభంకానుండగా.. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.. అదేరోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంసవాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.. ఇక, సెప్టెంబర్ 29న మూలానక్షేత్రం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు..
Read Also: Heart Attack: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి.. 25 ఏళ్ల యువకుడు మృతి
అమ్మవారు ఏ రోజు.. ఏ అలంకారంలో దర్శనమిస్తారు..?
సెప్టెంబర్ 22 – బాలా త్రిపురసుందరీ దేవి
సెప్టెంబర్ 23 – శ్రీ గాయత్రీ దేవి
సెప్టెంబర్ 24 – శ్రీ అన్నపూర్ణా దేవి
సెప్టెంబర్ 25 – శ్రీ కాత్యాయని దేవి
సెప్టెంబర్ 26 – శ్రీ మహాలక్ష్మీ దేవి
సెప్టెంబర్ 27 – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
సెప్టెంబర్ 28 – శ్రీ మహాచండీ దేవి
సెప్టెంబర్ 29 – శ్రీ సరస్వతీ దేవి
సెప్టెంబర్ 30 – శ్రీ దుర్గాదేవి
అక్టోబర్ 01 – శ్రీ మహిషాసురమర్దినీ దేవి
అక్టోబర్ 02 – శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కనకదుర్గమ్మ..