Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, మొదలైన భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దీనిని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన ముచ్చట్లు చెప్పారు.
READ ALSO: SS Thaman: తమన్‌ను పొగిడినవాళ్లే తిట్టేలా చేసిన రెహమాన్..?
ఈ సందర్భంగా నితేశ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘రామాయణ’ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాలో విజువల్స్ సూపర్‌గా ఉంటాయని, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి ఇవి ప్రామాణికంగా మారుతుందని వెల్లడించారు. కొన్ని కథలు ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే ఉంటాయని, అలాంటి వాటిల్లో రామాయణం మొదటి వరుసలో ఉంటుందని అన్నారు. ఈ చిత్రం కోసం ఐదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే గొప్ప వీఎఫ్ఎక్స్ స్టూడియోల్లో ఒకటైన ‘ప్రైమ్ ఫోకస్’తో కలిసి ఈ సినిమా కోసం వర్క్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. వాస్తవానికి తాను ఇంత పెద్ద సినిమా చేస్తున్నానని అంగీకరించడానికి రెండేళ్ల సమయం పట్టిందని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సమయానికి రామాయణ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుందని, దానిని తలచుకుంటే కొంచెం భయంగా ఉందని అన్నారు. ఈ భారీ చిత్రాన్ని సుమారుగా రూ. 4 వేల కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
READ ALSO: Gautam Gambhir: వైట్‌వాష్ ఎఫెక్ట్.. తెరపైకి గౌతమ్ గంభీర్ రాజీనామా!