SS Thaman: వరుస విజయాలతో సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎస్.ఎస్. తమన్‌ను నిన్నటి వరకు ఆకాశానికి ఎత్తిన వారే, ఇప్పుడు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే ఈ విమర్శలు అధికంగా వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు తమన్‌పై విమర్శల వెనుక కారణాలేంటి? నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ ఎందుకు? అనేది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ, తమన్ కాంబోలో వరుసగా నాలుగు హిట్స్ వచ్చిన నేపథ్యంలో, నందమూరి అభిమానులు తమన్ ఇంటిపేరు ముందు ‘నందమూరి’ అని తగిలించి గౌరవించారు. కానీ ఇప్పుడు వారే తమన్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
100W ఛార్జింగ్, OLED డిస్ప్లేలు, Bose స్పీకర్లతో Poco F8 సిరీస్ గ్లోబల్ లాంచ్..!
తాజాగా ‘అఖండ 2’ సినిమా నుంచి వచ్చిన ‘జాజికాయ…’ పాటపై నందమూరి ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రొటీన్ ట్యూన్’ ఇచ్చాడంటూ మండిపడుతున్నారు. పాటలోని సాహిత్య గొప్పదనాన్ని అర్థం చేసుకోకుండా, దబిడిదిబిడి మ్యూజిక్‌తో ఆ పాటను డామినేట్ చేశారని విమర్శిస్తున్నారు. మరోవైపు, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా తమన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘రాజా సాబ్’ సినిమా ఫస్ట్ సింగిల్‌తో తమన్ తమను ఆకట్టుకోలేకపోయారని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గతంలో ‘ఓజీ’ సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్‌గా నిలిచిందని, ఆ సినిమాకు తమనే హీరో – పవన్ కల్యాణ్ అంటూ ప్రశంసించారు. ఇంతలోనే, ఇప్పుడు అదే తమన్ ట్రోలింగ్‌కు గురికావడం గమనార్హం. తమన్‌పై ట్రోలింగ్‌కు పరోక్షంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కారణం అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు: ఏ.ఆర్. రెహమాన్ మరియు భీమ్స్ సిసిరోలియో. తమన్ నుంచి ఏ కొత్త సాంగ్ వచ్చినా, ఆడియన్స్ దాన్ని రెహమాన్, భీమ్స్ ఇచ్చిన మ్యూజికల్ హిట్స్‌తో పోల్చుకుంటున్నారు.
రామ్ చరణ్ సినిమాలోని ‘చికిరి’ సాంగ్‌తో రెహమాన్ 100 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టారు. మరో వైపు, ‘మన శంకర వరప్రసాద్’ చిత్రానికి భీమ్స్ ఇచ్చిన ‘మీసాల పిల్ల’ మెలోడీ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మధ్య కాలంలో క్రేజీ ప్రాజెక్ట్‌ల నుంచి ఏ పాట వచ్చినా, ప్రేక్షకులు దాన్ని ‘మీసాల పిల్ల’ లేదా ‘చికిరి’ పాటలతో పోల్చుకుంటున్నారు. తమన్ కొత్త పాటలు ఆ స్థాయి సంతృప్తిని ఇవ్వలేకపోతుండటంతోనే, నిన్నటి వరకు పొగిడినవారే నేడు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారని తెలుస్తోంది.