Sai Pallavi: తెలుగు సినిమా చరిత్రలో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా ఈవెంట్‌లో ఏకంగా డైరెక్టర్ సుకుమార్ అంతటి వ్యక్తి ఈ హీరోయిన్‌కు లేడీ పవర్ స్టార్‌గా కితాబు ఇచ్చారు. యూత్‌లో క్రేజ్‌ను, అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల కాలంలో తెలుగులో సాయిపల్లవి సినిమాలు చేయలేదు. ఆమె వెండి తెరపై చివరి సారిగా కనిపించిన చిత్రం అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్. ఆ తర్వాత ఆమె నుంచి మరే ఇతర తెలుగు సినిమా రాలేదు. ఇటీవల కాలంలో భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సినిమాలో ఈ స్టార్ హీరోయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తుంది.
READ ALSO: Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సినీ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జేట్ సినిమాలో మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
READ ALSO: Gautam Gambhir: వైట్‌వాష్ ఎఫెక్ట్.. తెరపైకి గౌతమ్ గంభీర్ రాజీనామా!