ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.. కాబట్టి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు?.. వారి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. బాధితులకు మేము అండగా ఉంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని.. టీడీపీలో చేరుతున్నారంటే జిల్లాలో ఎంతో ఉత్సాహం కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ఆయన అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.
నెల్లూరు నగర వైసీపీలో విభేదాలు మరోసారి తలెత్తాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మద్దతుదారుడైన హాజీపై అనిల్ వర్గీయులు దాడి చేయడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది.