నేడు ఏపీలోని పల్నాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న ప్రజాగళం బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రానికి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ నుంచి గన్నవరం వరకు ప్రత్యేక విమానంలో రానున్నారు.. గన్నవరం నుండి ప్రత్యేక హెలికాప్టర్లలో బొప్పూడికి మోడీ చేరుకోనున్నారు. సాయంత్రం 6 వరకు బొప్పూడి బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
Manjummel Boys : తెలుగులోకి రాబోతున్న మంజుమ్మెల్ బాయ్స్.. ఎప్పుడంటే?
4,000 మంది భద్రతా సిబ్బందితో పహారా కాస్తున్నారు పోలీసులు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సభా వేదిక వద్ద ఐదు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు అధికారులు.. ప్రత్యేక హెలిపాడ్లతో పాటు రాత్రి సమయంలో కూడా ప్రయాణించే అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు సిద్ధం చేశారు అధికారులు.. ప్రజాగలం సభలో ఉమ్మడి రాజకీయ ప్రణాళికను ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
Haryana : హర్యానాలో పెను ప్రమాదం.. లైఫ్ లాంగ్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్