ఇటీవల మలయాళంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. మొన్న విడుదలైన ప్రేమలు సినిమా అన్ని భాషల్లోను సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేసింది.. ఇప్పుడు మరో మలయాళ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తన సొంతం చేసుకుంది. అయితే, ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాను.. తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్..
ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ లో రూపోందిన సినిమా.. 2006 లో తమిళనాడులో జారిన యాదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది.. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా రూ.100 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.. ఇప్పటికి కలెక్షన్స్ తగ్గలేదు. ఈ వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి..
ఇకపోతే ఈ సినిమాను తెలుగులో డబ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతుంది.. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మైత్రీ తో పాటు ..మెట్రో సురేష్-నిరంజన్ రెడ్డిల భాగస్వామ్యంతో మలయాళ నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమాను ఈ నెల 22 న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. లేదా మార్చి 29 న విడుదల కావచ్చునని సమాచారం.. ఈ నెల 22 న శ్రీ విష్ణు ఓం భీం బుష్ రిలీజ్ కాబోతుంది.. అలాగే 29న టిల్లు స్క్వేర్ విడుదలకు రెడీగా ఉంది.. ఈ మూడు సినిమాల్లో టిల్లు స్క్వేర్ సినిమాకు బజ్ ఎక్కువగానే ఉంది.. మరి మేకర్స్ ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. గుణ గుహల్లో తప్పిపోయిన స్నేహితుడి కోసం అతని స్నేహితులు చేసిని ప్రయత్నాలు.. అప్పట్లో సంచలనం సృష్టించింది.. ఎవరూ కాపాడలేమని చెప్పినా కూడా వారు ఎంతో కష్టపడి తన ఫ్రెండ్ ను కాపాడుకుంటారు.. ఫ్రెండ్షిప్ గొప్ప తనాన్ని చాలా చక్కగా చూపించారు.. ఇక తెలుగులో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..