Nara Lokesh: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది.. ఆ విషయాన్ని అధికార వైసీపీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ములాఖత్‌లో కలిసిన ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా కుటుంబం ప్రమేయం లేదు.. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక పైసా కూడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు.. ఇక, చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. వైసీపీ నేతల ఈ విషయం చెబుతున్నారు.. చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. నా తల్లి భువనేశ్వరీ పై కూడా కేసులు పెడతామని భయపెడుతున్నారన్న ఆయన.. చంద్రబాబును జైల్లో పెట్టి 50 రోజులు గడిచిన ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేదని మండిపడ్డారు.
Read Also: Gidugu Rudraraju: రైతుల పరిస్థితి దుర్భరం.. సీఎం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి..
చంద్రబాబు అవినీతి చేస్తే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తుందని ఆరోపించిన ఆయే.. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయాం.. అవినీతి చేసిన వ్యక్తి పదిహేళ్లుగా బయట తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.. చంద్రబాబును చంపుతామని మావోయిస్టులు లేఖ రాసిన ప్రభుత్వం స్పందించడంలేదన్నారు లోకేష్.. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఆయన ఆరు కిలోలు బరువు తగ్గటం వాస్తవం అన్నారు. అధికారులు ఒకటి చెప్తారు.. వైద్యులు మరొకటి చేస్తారన్నారు. జైలు అధికారులకు కూడా స్వేచ్ఛ ఉన్నట్లు లేదన్నారు. ఈ వ్యవస్థ పై మాకు నమ్మకం లేదన్నారు.. ఏసీ బస్సుల్లో తిరిగితే అన్యాయం న్యాయం కాదు కదా? అని ప్రశ్నించారు నారా లోకేష్.