Naga Vamsi: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మంచి సినిమాలు తీస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతోస్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. మొదటి నుంచి కూడా నాగవంశీ కొద్దిగా పొగరుగా మాట్లాడతాడు అనేది అందరికి తెల్సిందే. భీమ్లా నాయక్ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ మధ్యనే మరోసారి నాగవంశీ వార్తల్లో నిలిచాడు. అవతార్2 సినిమా అస్సలు నచ్చలేదని ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక బుట్ట బొమ్మ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీకి ఈ ప్రశ్న ఎదురైంది.
వంశీ గారు అవతార్ సినిమా చూసిన తరువాత మీరు ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు, అలా ఎందుకు ట్వీట్ చేశారు ?? అని సుమ అడిగిన ప్రశ్నకు వంశీ మాట్లాడుతూ.. “త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్ తీసే సినిమాల పై ట్విట్టర్ లో అందరూ కామెంట్ చెయ్యొచ్చు, ఎలా ఉందని వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు కాని. ఎవరో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మనకి తెలీన వ్యక్తి సినిమా తీస్తే నాకు నచ్చలేదు అని కూడా నేను చెప్పకూడదా. అవతార్ తరువాత అవతార్ – 2కి ఉన్నా హైప్, ఆ అంచనాలు రీచ్ కాలేదు అని అనిపించింది. విజువల్స్ మూడు గంటలు అంటే నాకు తలకాయనొప్పి వచ్చింది” అని చెప్పుకొచ్చాడు. దీంతో మనోడికి గట్స్ ఎక్కువే అని కొందరు అంటుండగా.. ఎవరికైనా చూపించండ్రా అలా వదిలేయకండి ఆడిని వీడు ప్రొడ్యూస్ చేసిందే నాలుగు ఐదు. ఈ మాత్రం దానికే ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.